'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!

  • ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి
  • ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు
  • రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా
  • ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం
  • సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
మెగా హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటి గట్టు'. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముంబైలో నిర్వహించిన ఈ తాజా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ షెడ్యూల్‌లో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు కీలకపాత్రలో నటించినట్లు సమాచారం. అయితే, ఆ నటుడి వివరాలను చిత్రబృందం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఈ కలయిక సినిమాకు జాతీయస్థాయిలో మరింత ఆదరణ కల్పిస్తుందని విశేలేషకులు భావిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హనుమాన్’ను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక గ్రాండ్ యాక్షన్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ‘బాలి’ అనే శక్తివంతమైన పాత్రలో ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ వంటి ప్రముఖు నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీటర్ హెయిన్ పర్యవేక్షణలో రూపొందుతున్న స్టంట్స్, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్టు కోసం సాయి దుర్గా తేజ్ దాదాపు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టత ఇవ్వనుంది.

Sai Durga Tej
Sambarala Eti Gattu
Rohit KP
Primeshow Entertainment
Aishwarya Lekshmi
Pan India Movie

More Telugu News